![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -976 లో... రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలని శైలేంద్ర అనుకొని.. అతని ప్లాన్ లో భాగంగా స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి గొడవకి దిగేలా చేస్తాడు. ఆ గొడవ ఏంటని మినిస్టర్ వచ్చేలా చేస్తాడు శైలేంద్ర. మీటింగ్ లో మినిస్టర్ కి స్వయంగా రిషి కాల్ చేసి గొడవని చక్కదిద్దండని చెప్పడంతో శైలెంద్ర ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రిషి ఎక్కడ అని వసుధారని శైలేంద్ర బెదిరించడంతో.. అప్పుడే మహేంద్ర వచ్చి నీకు ఎందుకు రా అంటూ శైలేంద్రపై కోప్పడతాడు.
రిషి ఎక్కడ ఉన్నాడో? ఏ పని మీద బయటకు వెళ్ళాడో చెప్పాలి కదా? మా డాడ్ ని మీరందరు ఏ విషయం చెప్పకుండా మోసం చేస్తున్నారని శైలేంద్ర అనగానే.. మా అన్నయ్య అన్నీ అర్థం చేసుకుంటాడు. మేం ఏం చేసిన అందులో మంచి ఉందని నమ్ముతాడని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధారని అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు మహేంద్ర. శైలేంద్ర మాత్రం.. రిషిని ఎక్కడ దాచారు.. ఈ వసుధర పదే పదే నా దారికి అడ్డు వస్తుంది. ఫస్ట్ తన అడ్డు తొలిగించి దర్జాగా ఎండీ సీట్లో కూర్చోవాలి. ఈ వసుధారని ఎలా తప్పించాలని అనుకుంటాడు. అదే సమయంలో ఇన్ని రోజులుగా వసుధారని దక్కించుకోవాలిని ట్రై చేసి.. పెళ్లి అవ్వడంతో కన్పించకుండా ఉన్న వసుధార వాళ్ళ బావ రాజీవ్.. చీకటి గదిలో వసుధార ఫోటో చూస్తూ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటానే మరదలు పిల్ల అంటూ కథలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను పిల్ల అంటాడు. ఆ తర్వాత చక్రపాణికి వసుధార ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది. మేం ఇక్కడ ఉన్న విషయం మహేంద్రకి చెప్పావా అని చక్రపాణి అడుగుతాడు. లేదు మనకి తప్ప ఎవరికీ తెలియద్దు. వాళ్ళు చెప్తారని కాదు వాళ్ళ కదలిక బట్టి తెలుసుకుంటారని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత దేవాయనితో శైలేంద్ర మాట్లాడతాడు. ఆ రిషి గాడు వాళ్ళ దగ్గర ఉన్నాడని డౌట్ ఉండేది కానీ ఈ రోజు కన్ఫమ్ అయిందని మీటింగ్ లో శైలేంద్రకి రిషి పంపిన వాయిస్ మెసేజ్ దేవాయనికి వినిపిస్తాడు. నేను మొన్న చక్రపాణి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వసుధారనే కన్పించింది. చక్రపాణి కూడా లేడు.. అంటే చక్రపాణి రిషి ఇద్దరు ఎక్కడికో వెళ్లారు. అది కనిపెట్టాలని శైలేంద్ర అంటడు. ఆ తర్వాత వసుధార కాలేజీకీ సంబంధించిన ఫైల్స్ చూస్తుంటే మహేంద్ర అనుపమ వచ్చి హెల్ప్ చెయ్యాలా అని అడుగుతుంది. రిషి సర్ పక్కన ఉంటే బాగా హెల్ప్ చేసేవారని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |